నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : గణేష్ శోభాయాత్ర(Ganesh procession) సందర్భంగా నల్లగొండ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని పాత బస్తీలో నెలకొల్పిన ఒకటో నెంబర్ వినాయక విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy), జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు పూజలు చేసిన అనంతరం గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. అయితే స్టేజి మీదికి నాగం వర్షిత్ రెడ్డిని ఆహ్వానించకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి(Varshit Reddy)ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మంత్రి కోమటిరెడ్డి అసహనంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతల దౌర్జన్యాల(violence)ను నిలదీస్తూ నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేసేంతవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని శోభాయాత్ర వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు(police) నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేశారు.

