Police station | శాంతిభద్రలకు విఘాతం కలగొద్దు..

Police station | శాంతిభద్రలకు విఘాతం కలగొద్దు..

  • న్యూ ఈయర్ ప్రశాంతంగా జరుపుకోవాలి..
  • పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

Police station | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగొద్దని.. రానున్న నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్(Police station)ను డీసీపీ రామ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలను చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. శాంతిభద్రతలకు విగతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు(strict action) తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అలాగే డిసెంబర్ 31, న్యూ ఈయర్ వేడుకల్లో డీజే సౌండ్లు పెట్టి ఇతరులను ఇబ్బందులు పెడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రొ డ్ల మీదకు వచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. ఆయన వెంట పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణరావు, రూరల్ ఎకై సీ మల్లేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply