కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి..

కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి..

మధిర, ఆంధ్రప్రభ : మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామ శివారు చెరువు దగ్గర నిర్వహిస్తున్న కోడిపందాలు పై మధిర టౌన్ పోలీస్ గురువారం మెరుపు దాడి చేసి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ సిఐ రమేష్ తెలిపారు. పందెం రాయుళ్ళు నుండి రెండు కోడి పుంజులను, రెండు కోడి కత్తులను, 9 మోటారు సైకిళ్ళ తో పాటు రూ. 11,590 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కోడిపందాల నిర్వాహకులు పై కేసు నమోదు చేయటం జరిగింది. కోడి పందెంలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసంఘటిత కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ నవిత పాల్గొన్నారు.

Leave a Reply