పోలీస్ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ
- సిబ్బంది ప్రజల రక్షణకు కట్టుబడి పనిచేయాలి
- భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులు సమాజానికి స్ఫూర్తిదాయకులని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఎస్పీ కిరణ్ ఖరే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల రక్షణకు కట్టుబడి పని చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు ఎస్సైలు, డీపీఓ స్టాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

