police | పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్….

police | పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్….

police | అర్మూర్, ఆంధ్ర ప్రభ : ఆర్మూర్ పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని పంత్ రోడ్డు, రామ్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో పలు దొంగతనాలు చేసి పరారీలో ఉన్న రాంనగర్ కు చెందిన దాసరి అనిల్ ను అర్మూర్ పోలీసులు పట్టుకున్నారు.

దొంగతనం చేసిన బైకు పై వెళ్తుండగా అర్మూర్ బస్ స్టాండ్ వద్ద పోలీసులు పట్టుకుని అతని వద్ద నుండి హెచ్ఎఫ్ డీలక్స్ మోటర్ సైకిల్, ఒక బంగారు చైన్, ఒక బంగారు ఉంగరం,10 గ్రాముల వెండి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పట్టణ సీఐ పి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇట్టి కేసులో నిందితుని కదలికలను గమనించి కేసును చేదించిన కానిస్టేబుల్ కిరణ్ కుమార్, హరీష్ లను సీఐ అభినందించారు.

Leave a Reply