Police | విచారణ వివాదం..

Police | విచారణ వివాదం..

Police, తాండూరు, ఆంధ్రప్రభ : విచారణకు పిలిచిన పోలీసులు (Police) వ్యక్తి పై దాడి చేయడం తాండూరు నియోజకవర్గంలో వివాదాస్పందగా మారింది. పోలీసుల లాఠీ దెబ్బలతో అస్వస్థతకు గురైన బాధితుడు ఆసుపత్రి పాలు అయ్యాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్న పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసు విషయమై విచారణకు రావాలని పెద్దేముల్ పోలీసులు మంబాపూర్‌కు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని పోలీస్టేషన్‌కు పిలిచారు.

ఎస్ఐ వేణు, (SI Venu) పోలీసు సిబ్బంది తన పై లాఠీ దెబ్బలు వేశారని బాధితుడు ఫిరోజ్ తెలిపాడు. సుమారు 40 నిమిషాల పాటు కాళ్ల పై, చేతుల పై కొట్టారని ఆరోపించాడు. గౌస్ హత్యా నేరాన్ని ఒప్పుకోవాలని కొట్టారని తెలిపారు. కొట్టిన విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దని ఎస్ఐ వేణు చెప్పాడని తెలిపారు. పోలీసుల దెబ్బలకు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తనను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని వివరించారు. ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన పై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Leave a Reply