Police Force | పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి…
Police Force | వరంగల్ క్రైమ్, ఆంధ్ర ప్రభ : పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గుర్తు(Sunpreet Singh’s mark) చేశారు. పోలీస్ ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంటే మరింతగా బాధ్యతలు పెరిగిన్నట్టేనన్నారు. ప్రతి పోలీస్ అధికారి మరింత బాధ్యతాయుతంగా కర్తవ్య నిర్వహణ సాగించాలని కొత్వాల్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ అర్ముడ్ విభాగంలో ఏ. ఆర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్ స్పెక్టర్లుగా పదోన్నతులు పొందిన మల్లారెడ్డి, సాధిక్ అలీ, బీర్ దేవ్ లు ఈ రోజు వరంగల్ పోలీస్ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. అధికారులు అప్పగించిన పనులను సమర్ధవంతంగా పూర్తి చేయడంతో పాటు పోలీస్ శాఖ(Police Department)కు పేరు ప్రతిష్టలు పెంచే విధంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ ఫోర్స్(Police Force) శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజాశ్రేయస్సు కోసమే పని చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

