Flag march | ధర్మపురి పట్టణంలో పోలీసు ఫ్లాగ్ మార్చ్

Flag march | ధర్మపురి, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లో సందర్భంగా రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ధర్మపురి పట్టణంలో మున్సిపల్ కు జరిగే ఎన్నికలలో ఎలాంటి అవంచనీయా సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎలపాటి రామ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపురి సర్కిల్ పోలీస్ సిబ్బంది తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ.. ఎలక్షన్లను ప్రశాంతంగా నిర్వహించాలని ఎలాంటి గొడవలకు దారి తీయొద్దని , ప్రజలకు అభ్యర్థులకు తెలియజేశారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాగ్ మార్చ్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ, నంది,అంబేద్కర్ చౌక్ ల మీదు గా సాగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్సైలు గురక మహేష్, మిర్యాల రవీందర్,వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్, బుగ్గారం ఎస్సై సతీష్, గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ సుమారు వంద మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply