శ్రీకాకుళంలో నాకాబందీ

శ్రీకాకుళంలో నాకాబందీ

విస్తృతంగా లాడ్జిలు, వాహనాల తనిఖీలు
రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక పర్యవేక్షణ
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్


శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (Central, State Governments) ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమై నాకాబందీలో భాగంగా విస్తృతంగా లాడ్జీలు, వాహనాల తనిఖీలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి (K.V. Maheshwara Reddy) ప్రత్యేక ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్, సబ్‌–డివిజన్లు, నగర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, రద్దీ ప్రదేశాల్లో, జంక్షన్లు, టోల్‌గేట్లు, బైపాస్ రోడ్లు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు, నంబర్ ప్లేట్లు, లైసెన్సులు పరిశీలించారు.

అదేవిధంగా లాడ్జీలు (Lodges), బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబందీ చర్యలు చేపడుతున్నామ‌న్నారు.

అనుమానాస్పద వాహనాలు (Suspicious vehicles), ఆయుధాలు, మద్యం, గంజాయి, అక్రమ రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజలు పోలీసు తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే, వెంటనే డయల్ 112 ద్వారా సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply