పోలీసులు విస్తృత త‌నిఖీలు

పోలీసులు విస్తృత త‌నిఖీలు

  • ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఢిల్లీలో ఉగ్రవాదుల పేలుళ్ల నేపథ్యంలో పెద్దపల్లిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. డీసీపీ కరుణాకర్(DCP Karunakar) నేతృత్వంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మల్లేష్, నరేష్, సిబ్బంది జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సోదాలు చేశారు.

పెద్దపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ లో బాంబ్, డాగ్ స్క్వాడ్(Bomb, Dog Squad)తో తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల లగేజీలను పరిశీలించారు. అణువణువునా జల్లెడ(molecular sieve) పడుతూ సోదాలు, తనిఖీలు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ కరుణాకర్ ప్రజలను కోరారు.

Leave a Reply