అడ్డుకున్న పోలీసులు

అడ్డుకున్న పోలీసులు

ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి(Rajarampally) గ్రామంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు రోడ్డు పై ధర్నా చేశారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి, ప్రభుత్వం వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్(Best Available School) ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో రవాణా స్తంభిచగా, రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెల్గటూరు ఎస్సై ఉమసాగర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేశారు.

ఈ సందర్భంగా పోలీసులు, తల్లిదండ్రుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు(Fees) చెల్లించకపోవడంతో మా పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడింద‌ని, పాఠశాల యాజమాన్యాలు(Management) పిల్లలను తరగతులకు రానివ్వడం లేద‌ని త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్షర హైస్కూల్(Akshara High School) యాజమాన్యంతో చర్చించి, ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు విద్యార్థులను తరగతులకు అనుమతించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని స్థానిక ఎంఈఓ ఆదేశించారు.

Leave a Reply