Police | రహదారి భద్రత కోసం అరైవ్ అలైవ్..

Police | రహదారి భద్రత కోసం అరైవ్ అలైవ్..
Police , హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో అరైవ్ అలైవ్ పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేప ట్టింది. చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను ఆదివారం పోలీస్ శాఖ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురు వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు.
ఈ నేపథ్యంలో అతివేగం, ఓవర్ టేకింగ్ లకు పాల్పడొద్దని, తప్పనిసరిగా లో-బీమ్ హెడ్లైట్లను మాత్రమే వాడాలని తెలిపారు. వాహనానికి వాహనానికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని సూచించారు. సడన్ బ్రేక్ వేయడం, లేన్ తప్పడం చెయ్యొద్దని తెలిపారు. సడన్ బ్రేకులు వేయడం వలన వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. నిర్దిష్టమైన వేగంతో వాహనాలను నడపడం ద్వారా స్కిడ్ కాకుండా నివారించవచ్చు. తెలంగాణ పోలీసు శాఖ చేసిన ఈ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించి, తమ ప్రయాణాన్ని సురక్షితంగా, విజయవంతంగా ముగించాలని సూచిస్తున్నారు.
మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com
