పోలీసులు అప్రమత్తం
- బాంబు స్క్వాడ్ తనిఖీలు
మంత్రాలయం, ఆంధ్రప్రభ : కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(Vikrant Patil) ఆదేశాల మేరకు మాధవరం ఎస్సై వై విజయ్ కుమార్(Y Vijay Kumar), సీఐ రామాంజులు, సిబ్బంది డాగ్ స్క్వాడ్(Staff Dog Squad), బాంబు స్క్వాడ్ టీమ్స్ తో కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి(Shri Raghavendra Swamy) దేవాలయం, పరిసర ప్రాంతాలలో, ప్రధాన కూడళ్లలో, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో, తుంగభద్ర రైల్వే స్టేషన్ ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులను, అనుమానిత వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్రజలను/భక్తులను అనుమానిత వ్యక్తుల పట్ల, అనుమానిత వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసుల(Police)కు సమాచారం ఇవ్వాలని కోరారు.

