POLICE | అవనిగడ్డలో అంబటిపై కేసు నమోదు

POLICE | అవనిగడ్డలో అంబటిపై కేసు నమోదు
POLICE | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 352, 356(1), 351(1) సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో అలజడి, అల్లకల్లోలం సృష్టించాలన్న అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలుగుదేశం నేతలు కోరారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
