నేను గ‌ర్భిణిని.. న‌న్ను అరెస్ట్ చేయ‌కండి…

నేను గ‌ర్భిణిని.. న‌న్ను అరెస్ట్ చేయ‌కండి…

ఆశా వర్కర్ కన్నీటి పర్యంతం…

మోర్తాడ్, ఆంధ్రప్రభ : మోర్తాడ్ మండలం ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆందోళనల క్రమంలో ఒక గర్భవతి ఆశా వర్కర్ పోలీసులను వేడుకున్న ఉదంతం అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళితే..తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలకేంద్రంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చలో హైదరాబాద్‌కు వెళ్లకుండా పోలీసులు ఆశా వర్కర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక గర్భవతి అయిన ఆశా వర్కర్ వద్దకు పోలీసులు వెళ్లగా, ఆమె తీవ్ర ఆవేదనకు లోనైంది. నేను గర్భవతిని.. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ధర్నాకు వెళ్లే స్థితిలో లేను. నన్ను వదిలేయండి.. నన్ను అరెస్ట్ చేయవద్దు అని పోలీసుల కాళ్ళావేళ్ళా పడి వేడుకుంది.తన ఆరోగ్య పరిస్థితిని వివరించినప్పటికీ పోలీసులు వినకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది.

నేను ఎక్కడికీ రాను, ఇంట్లోనే ఉంటాను అని ప్రాధేయపడినా, ముందస్తు జాగ్రత్త చర్యల పేరుతో పోలీసులు ఒత్తిడి తేవడంపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వర్కర్ల పట్ల పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply