పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్ననిందితులకు నల్లగొండ(Nalgonda) పోక్సో కోర్టు న్యాయమూర్తి సింహ స్వప్నంలా మారారు. నేరం రుజువు అయితే కఠిన శిక్షలు విధిస్తూ సంచలన తీర్పులు ఇస్తున్నారు.
నల్లగొండ మండలం అన్నేపర్తి గ్రామంలో పదేళ్ల బాలికపై లైంగికదాడికి(sexual assault) పాల్పడ్డ 60 ఏళ్ల వృద్ధుడు ఊశయ్యకు 24 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 40,000 జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి ఈ రోజు తీర్పు వెలువరించారు.
బాధితురాలికి. రూ. పది లక్షల నష్టపరిహారం(compensation) చెల్లించాలని తన తీర్పులో న్యాయమూర్తి ఆదేశించారు. 2023. మార్చి 28 వ తేదీన ఇంట్లో ఉన్న పదేళ్ల బాలికపై ఊశయ్య లైంగికదాడికి పాల్పడ్డాడు. తన కూతురిపై జరిగిన అఘాయిత్యానికి(violence) పాల్పడిన ఊశయ్య పై బాలిక తండ్రి నల్లగొండ పోలీస్ స్టేషన్‌లో(at Nalgonda Police Station) ఫిర్యాదు చేశారు.
అప్పటి నుండి ఈ కేసును పోక్సో కోర్టు విచారణ చేపడుతుంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్( Sharat Chandra Pawar) నేతృత్వంలో నిందితునికి శిక్షపడేలా పోలీసులు పకడ్బందీగా సాక్షాలను దాఖలు చేయడంతో నిందితులు తప్పించుకోలేకపోయాడు.

