POCSO | పోక్సో కేసు..

- మైనర్ బాలిక పై అఘాయిత్యం..
- యువకుడు పై పాక్సో కేసు నమోదు..
- -ఎస్సై సద్దాం హుస్సేన్
POCSO | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో 17 ఏళ్ల బాలిక పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంచలన కేసులో 28 ఏళ్ల యువకుడి పై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు.
ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు బాలికను మోసం చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘటన పై పూర్తి దర్యాప్తు జరిపిన పోలీసులు కేసును పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేశారు.
