ఎమ్మెల్యే ని కలిసిన పోచంపల్లి సర్పంచ్

రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డిని గ్రామ ప్రజలు నూతన సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.

ఈ సంద‌ర్భంగా.. శనివారం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ సర్పంచ్ అభ్యర్థిని శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముద్దమల్ల రవి, కాంగ్రెస్ నాయకులు మైస భిక్షపతి, ఇల్ల రవి, మోటపోతుల తిరుపతి, పాడి దేవేందర్ రెడ్డి, జన్నపురెడ్డి మల్లారెడ్డి, కట్ల అన్నరెడ్డి, ముద్దామల్ల రమేష్, కేతిరి రమణారెడ్డి, ఇల్ల మొగిలి, కడారి అమర్, అలాగే వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply