ఇక శ్రీశైలానికి పరుగో పరుగు

ఇక శ్రీశైలానికి పరుగో పరుగు

( ఓర్వకల్లు , ఆంధ్రప్రభ) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) గురువారం కర్నూలు జిల్లాలో అడుగుపెట్టారు. ఆయన రాకతో జిల్లా మొత్తం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.

తరువాత ప్రధానమంత్రి ఎంఐ–17 హెలికాప్టర్‌ ద్వారా సుండిపెంటకు బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం (Srisailam) చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరిగే ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పోలీస్, ప్రోటోకాల్ అధికారులు, కేంద్ర భద్రతా దళాలు అన్ని విభాగాలు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టాయి.

Leave a Reply