Plants | అటవీశాఖ అనుమతులు లేకుండా…

Plants | అటవీశాఖ అనుమతులు లేకుండా…
Plants | బోధన్, ఆంధ్రప్రభ : అటవీ శాఖ అనుమతులు లేకుండా రహదారుల పక్కన, నిజాం సాగర్ ప్రధాన కాలువ బౌండ్రీలలో చెట్ల నరికివేత విచ్చల విడిగా కొనసాగుతుంది. హరిత హారంలో భాగంగా ఖాళీ స్థలాలలో నాటిన మొక్కలు చెట్లుగా పెరిగిపోయాయి. ఇందులో భాగంగా నిజాంసాగర్ కాలువ ఖాళీ స్థలాలలో మొక్కలు నాటారు. మొక్కలు పశువులు తినకుండా వాటి రక్షణకు కంచెలు వేశారు. వేసవి కాలంలో అవి చనిపోకుండా ఉపాధి హామీ కూలీలతో నీళ్లు పాయించారు.
ప్రస్తుతం చెట్లు వృద్ధి కావడంతో సత్యనారాయణపురం గ్రామ పంచాయితీ పరిధి లోని చెట్ల నరికివేతకు శ్రీకారం చుట్టారు. అనుమతులు లేకుండా నరుకుతున్న చెట్ల వివరాలు ఉన్నప్పటికీ ఆశాఖ అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
చెట్ల నరికివేత పై నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాస్ సైతం మౌనం గానే ఉన్నారు. చెట్లు నరకాలంటే అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ దానిని ఉల్లంగించి ఇష్టానుసారంగా నరికి వేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మామూళ్ల దందా చెట్లు నరికి వేతకు కారణం అవుతుoది.
