plane crash | విమానం కూలి 15మంది మృతి

plane crash | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విమానం కూలి 15మంది మృతిచెందిన విషాద ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 13మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో ఫ్లైట్‌ సంబంధాలు కట్ అయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆ దేశానికి చెందిన ప్రతినిధుల సభ సభ్యుడు ఒకరు ఉన్నారు. కూలిపోయిన విమానం ప్రభుత్వ యాజమాన్యంలోని సతేన సంస్థకు చెందిన విమానంగా గుర్తించారు.

Leave a Reply