Plan of Action | జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం

Plan of Action | జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం

  • 31.01.26 వ‌ర‌కూ…
  • మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

Plan of Action | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు గురువారం ప్రారంభ‌మైంద‌ని, ఈ నెల 31 వ‌ర‌కూ జ‌రుగుతాయి. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు రాష్ట్ర ర‌వాణా శాఖ‌(State Transport Department), హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్మెట్ లు బహుకరించారు.

మాసోత్సవాల సంబంధించిన పోస్టర్, వాహనాల స్టిక్కర్స్, విద్యార్థుల అవగాహన బుక్స్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మాసోత్స‌వాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ బి.శివ‌ధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ల అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ తొలగిస్తూనే దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను, అధికారులను భాగస్వామ్యం చేస్తూ నెల రోజుల పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్(Plan of Action) సిద్ధం చేశామ‌న్నారు.

ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల నుండి తాము రోడ్డు నిబంధనలు పాటిస్తాం అని హామీ పత్రం తీసుకోవాలి అన్నారు. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు, సీటు బెల్ట్ పెట్టుకోక పోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. అందరూ రోడ్డు నిబంధనలు పాటించాల‌ని కోరారు.

రాష్ట్రంలో 1000 మంది రవాణా శాఖ అధికారులు ఉంటే కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయ‌ని, అందరూ వారికి వారుగా నిబంధనలు పాటించాల‌న్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామ‌ని, లైసెన్స్ లు రద్దు చేస్తున్నామ‌ని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో మీడియా విస్తృతంగా అవగాహన కల్పించాలి అని కోరారు.

Leave a Reply