Pinnelli brothers | కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

Pinnelli brothers | కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Pinnelli brothers | మాచర్ల, ఆంధ్రప్రభ : గుండ్లపాడు జంట హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు (Pinnelli brothers) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోవడంతో కేసు మరో ఆసక్తికర దశలోకి ప్రవేశించింది.
సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు (Surrendered). గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో వారు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను 2 వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాచర్ల (Macherla) లోని కోర్టు వద్ద పోలీసులు బందోస్తు ఏర్పాటు చేశారు.
