Pink flag | గులాబీ జెండా రెపరెపలాడించాలి

Pink flag | గులాబీ జెండా రెపరెపలాడించాలి

  • ఏకగ్రీవ సర్పంచ్ వెంకట్ రెడ్డికి ఘన సన్మానం
  • మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

Pink flag | భువనగిరి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భువనగిరి నియోజక వర్గంలో గులాబీ జెండా(pink flag) రెప‌రెప‌పాలిడించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(MLA Paylla Shekhar Reddy) అన్నారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో బీఎన్ తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎడ్ల వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బీ ఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) అమలు చేయ‌ని హామీలను గడప గడపకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల సత్తి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కస్తూరి పాండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply