Pink Bigg Boss KCR | అంద‌రి దృష్టి పాల‌మూరుపైనే!

Pink Bigg Boss KCR | అంద‌రి దృష్టి పాల‌మూరుపైనే!

  • వేడెక్కిన‌ రాజ‌కీయ వాతావ‌ర‌ణం
  • తాజా రాజ‌కీయాల‌కు మ‌రోసారి పాల‌మూరు వేదిక‌
  • రెండేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి గులాబీ బిగ్ బాస్‌

Pink Bigg Boss KCR | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (పాల‌మూరు)పై అంద‌రి దృష్టి ప‌డింది. తాజా రాజ‌కీయాల‌కు పాల‌మూరు(Palamuru) మ‌రోసారి వేదిక కాబోతుంది. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో తెర‌పైకి వ‌చ్చిన పాల‌మూరు.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌కు కూడా పాల‌మూరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. గులాబీ బిగ్‌బాస్ కేసీఆర్ అద‌ను చూసి రెండేళ్ల త‌ర్వాత(After two years) త‌న శంఖ‌రావం పూరించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. పాల‌మూరు వేదిక‌గా పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అందరి దృష్టి పాల‌మూరుపైనే ప‌డింది. తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి(Common to the movement) పాలమూరు జిల్లాను వేదికగా చేసుకొని ముందుకు సాగినట్లుగానే అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు పాలమూరును వేదిక‌గా కేసీఆర్ ఎంచుకున్నారు.

Pink Bigg Boss KCR | తెర‌పైకి నీళ్ల రాజ‌కీయం
మ‌రోసారి తెర‌పైకి కృష్ణ జ‌లాలు(Black waters) అంశం ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌, నీటి పారుద‌ల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే టి.హ‌రీశ్‌రావు ప‌దేప‌దే తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ల వివాదంపై మాట్లాడుతునే ఉన్నారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(Banakacharla Project) విష‌యంలో గ‌ట్టిగా వ్య‌తిరేకించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు అయిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అంటూ అనేక ఆరోప‌ణ‌లు కూడా చేసిన విష‌యం తెలిసింది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి పాల‌మూరు, న‌ల్లగొండ జిల్లాల ప్రాజెక్టుల స్థితిగ‌తుల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లాల‌ని బీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం అడుగులు వేస్తోంది.

Pink Bigg Boss KCR | పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పోరాటం!
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి(Palamuru-Ranga Reddy) ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకుంద‌ని, మిగిలిన 15 నుంచి 20 శాతం పనులు పూర్తి చేస్తే సాగు, తాగునీరు సమస్య పూర్తిగా తీరుతుంద‌ని బీఆర్ఎస్ వాద‌న‌. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల జరిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు(as determined) తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం నారాయణపేట-మక్తల్-కొడంగల్ నియోజకవర్గాలకే పరిమితమయ్యేలా కొత్త ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏముంది!? వారి ప్ర‌శ్న‌.

తొలుత దీన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న‌ది బీఆర్ఎస్ నిర్ణ‌యం. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పరిస్థితులను(Project conditions) ప్రజలకు వివరించడంతో పాటు విస్తృత ప్రచారం చేసే విధంగా బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల పనులు ఏ మేరకు జరిగాయి, ఎన్ని నిధులు(How many funds?) ఖర్చు చేశారు, వంటి విషయాలను ప్రజలకు వివరించాలని, వీటితోపాటు రైతు వ్యతిరేక విధానాలను కూడా వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. జనవరి మొదటి లేదా రెండో వారంలో ఈ సభను(Assembly) నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ రోజు ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌నున్నారు.

Pink Bigg Boss KCR | కృష్ణా జలాలపై బీఆర్ఎస్ రణభేరి
కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు(Serious allegations) చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని ఇప్ప‌టికే విమ‌ర్శించిన సంగ‌తి విదిత‌మే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య‌ నేతలతో భేటీ కాబోతున్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్‌, పలువురు పార్టీ సీనియర్ నాయకులు(Senior leaders) కూడా పాల్గొననున్నారు. మూడు జిల్లాల్లో జనవరి 2026లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వంపై లేవనెత్తాల్సిన ముఖ్య అంశాలు(Key points), నీటి హక్కుల సమస్యలపై బలమైన డిమాండ్లు చేయడంపై కూడా లోతైనగా విస్తృతంగా చర్చించనున్నారు.

CLICK HERE TO READ పురాణాలు యువతకు బోధించాలి

CLICK HERE TO READ MORE

Leave a Reply