మీ కొత్త వాహనానికి అత్యుత్తమ రక్షణ

వెబ్ డెస్క్, (ఆంధ్ర‌ప్ర‌భ‌) : పండుగ సీజన్ అంటే చాలా మంది భారతీయులకు వేడుకల సమయం, ఈ శుభ సందర్భంలో ఖరీదైన కొత్త వస్తువులను కొంటారు, అదే సమయంలో ప్రత్యేక ఆఫర్లు, శుభ ముహూర్తాలు ఉండటం వారికి కలసివచ్చే అంశం. అయితే, మీరు కొత్త వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే, ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ విషయానికి వస్తే, అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి. సరైన వాహనాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, సరైన పాలసీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.

వెహికల్ ఇన్సూరెన్స్ (Vehicle Insurance) అనేది కేవలం చట్టపరమైన అవసరాలకు మాత్రమే పరిమితం కాదు – ఇది మిమ్మల్ని, మీ వాహనాన్ని ఊహించని నష్టాల నుండి రక్షించడంలో సహాయపడే ఆర్థిక భద్రతా వలయం. తగిన కవరేజ్‌ ఉన్న సరైన కాంప్రెహెన్సివ్ పాలసీని తీసుకోవడం వల్ల థర్డ్ పార్టీ లయబిలిటీలు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్, ప్రమాదం వల్ల కలిగిన నష్టాలకు కవరేజ్‌ వంటి ఎన్నో రకాల ఇన్సూరెన్స్ ప్రయోజనాలు మీకు లభిస్తాయి.

సాధారణంగా, వెహికల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు ప్రక్రియ గందరగోళంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అయితే, విశ్వసనీయతతో పాటు, డిజిటల్ సొల్యూషన్లకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడంలో PhonePeకు ఉన్న నైపుణ్యం వల్ల ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా మారింది, అంతేగాక సరసమైన ధరకే లభిస్తోంది.

టూ-వీలర్స్, ఫోర్-వీలర్స్‌కు PhonePe కొత్త వెహికల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది, సాంప్రదాయక డీలర్‌షిప్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లతో పోలిస్తే, కొత్త వాహన కొనుగోలుదారులందరికీ సరసమైన ధరకే ఆన్‌లైన్‌లో ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందించడమే ఈ ప్లాన్‌ లక్ష్యం. ఈ నిబంధనతో, మీరు పలు ఇన్సూరెన్స్ సంస్థలు అందిస్తున్న పాలసీలను పోల్చి చూసి, నేరుగా PhonePe యాప్‌లో ఆన్‌లైన్‌లోనే పాలసీని కొనుగోలు చేయవచ్చు.


డీలర్‌షిప్ ధరలతో పోలిస్తే కొత్త బైక్ ఇన్సూరెన్స్‌పై ₹5,000 వరకు, అలానే కొత్త కారు ఇన్సూరెన్స్‌పై ₹50,000 వరకు ఆదా యూజర్లు పలు ఇన్సూరెన్స్‌ సంస్థల్లో తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు, యాడ్-ఆన్‌లతో వారి ప్లాన్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎటువంటి హిడెన్ ఛార్జీలు లేకుండా, కవరేజ్‌ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా, వేగవంతమైన కొనుగోలు ప్రక్రియ.

ఇది పరిమిత కాలపు పండుగ ఆఫర్ కాదు; PhonePe యాప్‌లో వాహన కొనుగోలుదారులందరికీ అందుబాటులో ఉన్న ఒక ప్రామాణికమైన ఫీచర్. ఈ ప్లాన్ మీ మొత్తం ఇన్సూరెన్స్‌ కొనుగోలు అనుభవాన్ని సులభతరం చేస్తుంది, డబ్బు ఆదాతో పండుగ సీజన్‌ మరింత సంతోషంగా మారుతుంది. మీరు వివిధ ఇన్సూరెన్స్‌ సంస్థలు అందిస్తున్న పలు ప్లాన్‌లను సులభంగా పోల్చి చూసి, మీ అవసరాలకు తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు, అలానే కవరేజ్‌ను మెరుగు పర్చడానికి మీకు కావాల్సిన యాడ్-ఆన్‌లతో దాన్ని కస్టమైజ్ చేయవచ్చు. ఇది మీ కొత్త వాహనానికి మొదటి రోజు నుండే పూర్తిగా రక్షణ కల్పిస్తుంది, అలానే మీ ప్రియమైనవారితో కలసి సంతోషంగా పండుగలు జరుపుకోవడానికి కావాల్సిన పూర్తి మనశ్శాంతి మీకు ఎప్పుడూ ఉండేలా చూసుకుంటుంది.

కొనుగోలు ప్రక్రియ చాలా సరళంగా, ఇబ్బందుల్లేకుండా ఉంటుంది. PhonePe వారి కొత్త వెహికల్ ఇన్సూరెన్స్‌తో, కేవలం 5 సులభమైన దశల్లోనే మీరు పెద్ద మొత్తంలో ఎలా ఆదా చేసుకోవచ్చో ఇక్కడ వివరించాము:

PhonePe యాప్‌ను ఓపెన్ చేయండి.
ఇన్సూరెన్స్‌ విభాగానికి వెళ్లండి.
“కొత్త కారు ఇన్సూరెన్స్‌” లేదా “కొత్త బైక్ ఇన్సూరెన్స్‌”ను ఎంచుకోండి
కొన్ని ప్రాథమిక వివరాలను ఎంటర్ చేసి, కొటేషన్లను పోల్చి చూడండి.
మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని, పేమెంట్‌ను పూర్తి చేయండి.
ఇవి పూర్తయిన తర్వాత, మీ పాలసీ వెంటనే మీకు అందుతుంది, మీరు మీ కొత్త వాహనాన్ని ఆందోళన లేకుండా నడపగలిగేలా సిద్ధంగా ఉంటుంది.

‘2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్‌’ అనే IRDAI స్వప్నానికి అనుగుణంగా, భారతీయులందరికీ సరసమైన ధరకే ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి PhonePe కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం, కస్టమర్లకు అనేక ప్లాన్‌లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని, పలు యాడ్-ఆన్‌లను, సజావుగా సాగే పాలసీ జారీ అనుభవాన్ని అందించడానికి PhonePe పలు ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అందుకే, పండుగ ఎలానూ ప్రారంభమవుతోంది కాబట్టి, ఇన్సూరెన్స్‌ గురించి తర్వాత ఆలోచిద్దాంలే అని అనుకోకుండా, PhonePe యాప్‌లోనే మీ కొత్త వాహనానికి ఇన్సూరెన్స్‌ చేయండి, పూర్తి మనశ్శాంతితో మీ వేడుకలను ప్రారంభించండి.

Leave a Reply