Phone Tapping | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Phone Tapping | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Phone Tapping | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా.. రెండేళ్లవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదన్నారు. విచారణను త్వరగా ముగించాలన్నారు. దోషులకు శిక్షపడాలి.. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. సిట్ విచారణకు తనను పిలిస్తే వెళ్తానన్నారు. తనఫోన్, తనభర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని కవిత తెలిపారు.
