Phone | దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్

Phone | దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్
Phone| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ (Iran, America-Israel) యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వివిధ దేశాధినేతలతో ఫోన్ (phone) లో చర్చించారు. ఒమన్, మలేషియా, ఫ్రాన్స్ (Oman, Malaysia, France) దేశాధినేతలతో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) తోనూ ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం సాధించడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మోడీ నొక్కి చెప్పారు. వీలైనంత త్వరగా శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
