petition | సదర్ మాట్ సమస్యలను పరిష్కరించాలి..

petition | కడెం(నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : సదర్ మాట్ ప్రత్యేక కాలువతో పాటు పెద్దూర్ కాలువ సైడ్ వాల్, చిట్యాల ఊర చేరువు కాలువ మరమత్తులకు రైతు నేత రాజేందర్ హపావత్ ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యే భోజ్జు పటెల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేసి వేంటనే వ్యయం అంచనా వేయాలని చెప్పారు.
నీటిపారుదల శాఖ, ఎమ్మెల్యే నిధుల నుండైనా ఆ కాలువను మెరుగుపర్చడాని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సదర్ మాట్ ప్రత్యేక కాలువ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రైతు నేత కృతజ్ఞతలు తెలిపారు.
