జన్నారం, జులై 7 (ఆంధ్రప్రభ): గ్రామస్థాయిలో ప్రజల్లో కెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ((Vedma Bhojju Patel) అన్నారు.మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని జన్నారం (Jannaram), దస్తురాబాద్ (Dasturabad) మండలాల్లోని ముఖ్య నేతల,కార్యకర్తల సమావేశం సోమవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ఆర్ఎస్ బంకటాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున చేపట్టిన పథకాలను కార్యకర్తలు ఇంటింటి తిరుగుతూ క్లుప్తంగా వివరించాలన్నారు. ఒక్క నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని ఆయన సూచించారు. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలు నిర్వహించ్చనున్నందున సన్నద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ కృషి చేయాలని ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు వరిస్తాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ,పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి,పాండ్వాపూర్ సింగల్ విండో చైర్మన్ ఆర్. శైలజ రమేష్ రావు, పార్టీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మల్లేష్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.