చలి పోరి వచ్చేసిందోచ్
దీపావళి (deepavali) అమవాస్య పోలేదు. కార్తీక దీపం వెలగలేదు. అప్పుడే సరసాల మంచు గుమ్మ ఆవులించింది. కితకితలు షురూ చేసింది. చలి సయ్యాటలో జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేయటాని ఊళ్లపై వళ్లు విరుచుకుంటోంది. ఏసీ గదిలో 21 డిగ్రీల సెల్సియస్ రికార్డును స్టార్ట్ చేసింది. సైబరాబాద్ (Cyberabad) హైటెక్ సిటీని తన కౌగిట్లోకి లాక్కుంటోంది. మరో రెండు మూడు రోజుల్లోనే జనం స్వెట్టర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టక తప్పదు.

ఎందుకంటే.. వాతావరణంలో మార్పులు అంతే. నైరుతీ రుతుపవనం టాటా చెప్పింది. ఈశాన్యం రుతువులమ్మ తలుపు కొట్టింది. కాదు.. మెట్టినింట అడుగు పెట్టేసింది. అంతా బాగుంటే.. అందరం దుప్పట్లో దూరి నిద్దరోతాం. బెడిసి కొట్టిందా వర్షాలు దంచి కొడతాయ్, రైతన్న జర భద్రం సైక్లోన్ సైతాన్ పట్ల బీ అలెర్ట్. ఇది సగటు మధ్య తరగతి జీవి అడ్వాన్స్ వార్నింగ్.
ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ డెస్క్