జగన్ కు జన నీరాజనం…

  • అవినాష్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం…
  • బందరు రోడ్డుపై సాదర స్వాగతం…
  • అభిమాన నేతపై పూలవర్షం…
  • గుమ్మడికాయతో దిష్టి తీసిన మహిళా నేతలు..
  • జగన్ ను చూసేందుకు రహదారిపై బారులు తీరిన వైనం…
  • జై జగన్ అంటూ నినదించిన అభిమానులు…
  • పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం…

ఆంధ్రప్రభ, విజయవాడ : మొంథ తుఫాను కారణంగా కృష్ణా జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. తాడేపల్లి నుండి బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ పటమట మీదుగా కృష్ణాజిల్లా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు సానుభూతిపరులు రహదారి పొడవున నీరాజనం పట్టారు. అడుగడుగునా జగన్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు మహిళా నేతలు కార్యకర్తలు జగన్ కు గుమ్మడికాయతో దిష్టి తీశారు.

మారుమోగిన జై జగన్ నినాదం…

తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తమకున్న అభిమానాన్ని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెల్లడించారు. నగరం గుండా సాగుతున్న ఆయన పర్యటనలో భాగంగా కాన్వాయ్ కి ఎదురొచ్చి సాదర స్వాగతం పలికి జై జగన్ అంటూ నినదించారు. తమ అభిమాన నాయకుడు దగ్గరగా చూసిన వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంది. తనను అభిమానంగా చూస్తున్న పలకరించిన ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు ముందుకు సాగారు. ఆయనతోపాటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఇన్చార్జులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్లారు.

Leave a Reply