గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లకు నమ్మకూడదు ఎస్సై సిహెచ్. తిరుపతి అన్నారు.ఇటీవల కాలంలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమ్‌గల్‌ ఎస్సై సిహెచ్.తిరుపతి, సూచించారు. సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సై తెలిపారు.

ప్రత్యేకంగా ఓటీపీలు, బ్యాంక్ పిన్లు లేదా ఇతర వ్యక్తిగత బ్యాంకింగ్ వి వర్గాలను ఎట్టి పరిస్థితుల్లో నూ ఎవరికీ షేర్ చేయవద్దని సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులు లేదా ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేయడం ప్రమాదకరమని ప్రజలకు హెచ్చరించారు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే కాల్సు నమ్మవద్దని. ఆవి మోసపూరిత కాల్స్ అయ్యే అవకాశముందని చెప్పారు.

అలాగే తెలియని లింకుల ద్వారా ఎటువంటి చెల్లింపులు వె యకూడదని ప్రజలకు సూచించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఎప్పుడూ అధికారిక యాప్ లు లేదా అధికారిక వెబ్ భలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి మోసాల నుంచి తమమ తాము రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే 1967 లేదా 100కాల్ చెసి సంప్రదించాలని ఎస్సై కోరారు.

Leave a Reply