PEOPLE | గెలుపు నాదే..

PEOPLE | గెలుపు నాదే..


PEOPLE | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అడవి సోమన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి కొఠారి బాపు పేర్కొన్నారు. ప్రచారంలో ఆయన గడప గడపకు ప్రచారం చేస్తూ దూసుకు వెళ్తున్నారు. ప్రచారంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడవి సోమన్ పల్లి ఎన్నికల్లో గెలుపు నాదే, ప్రజల అభివృద్ధి బాధ్యత నాది అని ఆయన హామీ ఇస్తున్నారు. ప్రజల సహకారంతో గెలవడం ఖాయమని, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు అండతో గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన తెలుపుతున్నారు. గతంలో సర్పంచ్ గా మా సతీమణి చేసిన హయాంలో గ్రామానికి 228 ఇందిరమ్మ ఇండ్లను మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని, మరోసారి అవకాశం కల్పిస్తే మంథని మండలంలోని అడవి సోమన్ పల్లి గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ఆదర్శవంతమైన గ్రామపంచాయతీ కోసం ఎల్లవేళలా కష్టపడతానని ఆయన తెలుపుతున్నారు. గ్రామం కోసం కష్టపడే వారికే అవకాశం కల్పించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నారు. ఆయన తరుపున ప్రజలే ప్రచారం చేయడం విశేషం. ఆయన ప్రచార యాత్ర విజయ యాత్ర తలపిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆయన గెలుపు సాధించడం పక్కా అని ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

Leave a Reply