Peddavangara | ఎంపీడీవో కార్యాలయానికి తాళం

Peddavangara | ఎంపీడీవో కార్యాలయానికి తాళం

  • 30 నెలల అద్దె.. రూ.2.10లక్షలు బకాయి..
  • రూ.1లక్ష 80వేల కరెంట్ బిల్లు బకాయి

Peddavangara | పెద్దవంగర, ఆంధ్రప్రభ : అద్దె డబ్బులు ఇవ్వడం లేదని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఇవాళ ఉదయం 9 గంటలకు భవనం యజమాని రాంపాక నారాయణ తాళం వేశారు. దీంతో కొన్ని గంటల పాటు అధికారులు, ఉద్యోగులు ఆరుబయటే ఉండాల్సి వచ్చింది. పెద్దవంగర మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది.

గతంలో 8నెలల అద్దె బకాయికి సంబంధించి రూ.56వేల చెక్కును సిద్ధం చేసి మరిపెడ ఎస్ టీ వో లో ఇవ్వగా, వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఆన్ లైన్ లో చూపిస్తున్నది. ఇప్పటికీ ఆ డబ్బు యజమానికి అందలేదు. దీంతో మొత్తం 30నెలల అద్దె రూ.2.10లక్షలు బకాయిలు, అదేవిధంగా రూ.1లక్ష 80వేల కరెంట్ బిల్లు బకాయి ఉండడంతో యజమాని రాంపాక నారాయణ కార్యాలయానికి తాళం వేశారు.

కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో కొన్ని గంటల పాటు అధికారులు, సిబ్బంది ఆరుబయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో వేణుమాధవ్ కార్యాలయానికి చేరుకొని పెండింగ్ కిరాయి చెల్లిస్తానని భరోసా ఇవ్వడంతో రాంపాక నారాయణ కార్యాలయ తాళాన్ని తీశాడు.

Leave a Reply