Peddapalli | శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్

గోదావరిఖని ( ఆంధ్రప్రభ) – అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 BNSS సెక్షన్‌ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే వ్యూహంలో భాగంగా గోదావరిఖని లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ గోదావరిఖని 1 టౌన్, రామగుండంసర్కిల్ సివిల్ పోలీసులకు మాబ్ ఆపరేషన్-మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం కు పెద్దపల్లి డిసిపి కర్ణాకర్ ముఖ్యఅతిథిగా హాజరై సిబ్బంది తో మాట్లాడారు.

ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ…. ప్రజల, ప్రభుత్వ ఆస్తులు ద్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, జన సమూహాలను నియంత్రించి శాంతిభద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బందికి వివరించారు.మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు శాంతిభద్రతలను పరిరక్షించడానికి పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది? ఘర్షణలకు పాల్పడిన వారిపై ఏవిధంగా చర్యలు తీసుకుంటారు? అనే దాని గురించి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు డీసీపీ చెప్పారు.

మాబ్ ఆపరేషన్ డ్రిల్ లో ఓ వైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేసేందుకు మొదటగా హెచ్చరికలు వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతి, ఉన్నతాధికారుల అనుమతితో భాష్పవాయువు ప్రయోగించడం, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించడం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ ఛార్జీ చేపట్టడం, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయడం అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటివి ఆర్ ఎస్ఐ శివ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రఫీ లు సివిల్ సిబ్బందితో ప్రాక్టిస్ చేపించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, రవీందర్ రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని సబ్ గోదావరిఖని ఎస్ఐ రమేష్, భూమేష్, ఏన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, మానస, రామగుండం ఎస్ఐ సంధ్య రాణి, అంతర్గం ఎస్ఐ వెంకట్, ఆర్ఎస్ఐ శివ కుమార్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *