PDS RICE | అక్రమంగా నిల్వ చేసిన..

PDS RICE | అక్రమంగా నిల్వ చేసిన..

  • పీడీఎస్ బియ్యం స్వాధీనం
  • కేసు నమోదు

PDS RICE | అచ్చంపేట, ఆంధ్రప్రభ : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి అమ్మకానికి సిద్ధం చేసిన వ్యక్తిపై సివిల్ సప్లైస్(Civil Supplies), పోలీస్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అధికారుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని ఒక ఇంట్లో అక్రమంగా భద్రపరిచిన పీడీఎస్‌(PDS)కు చెందిన మొత్తం ఏడు సంచుల్లో సుమారు మూడు క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.

పీడీఎస్ బియ్యాన్ని వ్యక్తిగత లాభాల కోసం నిల్వ చేసి అమ్మకానికి సిద్ధం చేసినట్లు నిర్ధారణ కావడంతో అచ్చంపేట పట్టణానికి చెందిన వ్యక్తి కొత్త రాఘవేందర్ పై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పట్టణ ఎస్సై సద్దాం హుస్సేన్(Saddam Hussein), సివిల్ సప్లయిస్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఏ. హెమ్ల నాయక్ తెలిపారు. అక్రమ రవాణా, నిల్వపై నిరంతరంగా ప్రత్యేక దాడులు(Special Attacks) కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి ఘటనలు గమనించినప్పుడు వెంటనే సమాచారం అందించాలని వారు కోరారు.

Leave a Reply