అందాలను తిలకించిన పీసీసీఎఫ్
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి రేంజ్ కవ్వాల ఫారెస్ట్ సెక్షన్‌లోని పాలగోరి అటవీ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం హైదరాబాద్ పీసీసీఎఫ్, (PCCF) చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు(Chief Wildlife Warden Ael Singh Meru) సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఇటీవల జరిగిన పరిణామాలను, చెట్ల నరికివేత, ఆదివాసీల తాత్కాలిక గుడిసెలు తొలగించిన వ్యవహారాలపై ఎఫ్డీఓ(FDO)ను అడిగితెలుసుకున్నారు. అనంతరం జన్నారం ఫారెస్ట్ రేంజులోని గేట్ నెంబరు-1 ద్వారా గోండుగూడ, బైసన్ కుంట ప్రాంతాలలో జంగల్ సఫారీలో ఆయన వెళ్లి అటవీ అందాలను తిలకించారు. ఆయన వెంట మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశిష్ సింగ్(Shiv Ashish Singh), స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, ఇందనపల్లి, జన్నారం, తల్లపేట రేంజర్లు శ్రీధరచారి, మమత, సుష్మారావు, గోండుగూడ బీట్ ఆఫీసర్ లాల్బాయి తదితరులు ఉన్నారు.