హైదరాబాద్ : పద్మశాలి వంశంలోని వ్యాపారస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆశయంతో పద్మశాలి బిజినెస్ నెట్వర్క్(PBN) అనే వేదిక ద్వారా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి PBN ఉగాది పురస్కారాలు 2025 ఓం కన్వెన్షన్ నార్సింగి లో ఘనంగా ని జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మాజీ లోక్ సభ సభ్యుడు సంజీవ్ కుమార్ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎల్ రమణ , గ నిమ్స్ హాస్పిటల్ లైజనింగ్ ఆఫీసర్ రమేష్ , డాక్టర్ పరికిపండ్ల అశోక్, గుజ్జ సత్యం, వాళ్లకటి రాజకుమార్, ఇస్రో శాస్త్రా వేత్త గంజి వెంకట నారాయణ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థాపక చైర్మన్ గంజి శ్రీనివాసులు ని అతిధులు అభినందించారు. పద్మశాలి కులస్తుల వ్యాపార రంగంలోని అన్ని మెలకువలు తెలియజేసి వస్తువులను ఏ విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవాలో ఈ PBN సహకరిస్తుందని వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా 2025 సంవత్సరం గాను ఉగాది పురస్కారాలను వివిధ వ్యాపార ప్రముకులకు, అనేక రంగాల్లో సేవలు అందించిన పద్మశాలి కవులు, కళాకారులకు, పాత్రికేయులకు, రాజకీయ ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి రమేష్, శ్రీకాంత్ వొడ్నాల , రఘురామ్ తిరుమల, గంజి వెంకటేష్ , స్వప్న సోనీ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు