PBKS vs RR | ఫామ్ లోకి వ‌చ్చిన యశస్వి.. 10 ఓవర్ల‌కు ఆర్ఆర్ స్కోర్ !!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 లో భాగంగా నేడు జ‌రుగుతున్న మ‌రో కీల‌క మ్యాచ్ లో రాజస్థాన్ రాయ‌ల్స్ – పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. పంజాబ్ వేద‌కగా జ‌రుగుతున్న మ్యాచ్ టాస్ ఓడి రాజ‌స్థాన్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేప‌ట్టంది.

ఈ క్రమంలో ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన యువ స్టార్ యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సుల‌తో 44) , కెప్టెన్ సంజు శాంసన్ (24 బంతుల్లో 5ఫోర్ల‌తో 34) బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ సీజ‌న్ తో పేవ‌ల ఫామ్ తో స‌త‌మ‌త‌మౌతున్న జైస్వాల్.. నేటి మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రోవైపు కెప్టెన్ సంజూ కూడా బౌండ‌రీల‌తో అద‌ర‌గొడుతున్నాడు. వీరిద్ద‌రూ క‌లిసి 10 ఓవ‌ర్ల‌లో తొలి వికెట్ కు 60 బంతుల్లో 89 ప‌రుగులు జోడించారు.

అయితే, 11 వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ సంజూ (38) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ – పరాగ్ ఉన్నారు.

Leave a Reply