Challenge Accepted | పవన్‌ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించిన మంత్రి లోకేష్..

కోటి మొక్కలు నాటేందుకు సై అన్న మంత్రి
విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం

అనంత‌పురం – జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు మంత్రి నారా లోకేష్‌.. తాను అన్న ప‌వ‌న్ చాలెంజ్ కు రెడీ అని ప్రకటించారు.. మెగా పేరెంట్-టీచర్స్‌ మీటింగ్‌ సందర్భంగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా మీడియాతో మాట్లాడుతూ, ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలెంజ్ గురించి వివ‌రించారు.

ఆ మధ్య అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు.. మేం మొక్కలు నాటుతున్నాం.. మీరు మొక్కలు నాటేందుకు సిద్ధమా అని సవాల్‌ చేశారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కోటి మొక్కలు నాటాలన్న సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను అని ఈ రోజు వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతామని ప్రకటించారు..

Leave a Reply