Pawankalyan | కొండగట్టు అంజన్న.. నాకు పునర్జన్మను ఇచ్చాడు

Pawankalyan | కొండగట్టు అంజన్న.. నాకు పునర్జన్మను ఇచ్చాడు
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pawankalyan | జగిత్యాల జిల్లా, ఆంధ్రప్రభ : ఏపీ (AP) ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇవాళ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
రూ.35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల (Devotees) వసతి కోసం 96గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమిపూజ చేశారు. పవన్ కల్యాణ్ తో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులున్నారు.
ఈసందర్భంగా పవన్ కల్యాణ్ (Pawankalyan) మాట్లాడుతూ… కొండగట్టు అంజన్న అంటే తనకు సెంటిమెంట్ అన్నారు. అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డ కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని పవన్ అన్నారు.
గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని కోరారు. తిరుమల తిరుపతి (Tirupati) దేవస్థానం సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పవన్ అన్నారు.
గిరి ప్రదక్షిణ అంశాన్ని తన దృష్టికి తెచ్చారని, కొండగట్టు గిరి (Giri) ప్రదక్షిణకు సహాయం చేస్తామని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ కృతజ్ఙతలు తెలిపారు. రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, ఆంజన్న ఆశీస్సులు ఆయనకు ఉండాలని పవన్ పేర్కొన్నారు.
CLICK HERE TO READ టీటీడీ నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధి
