‘ఓజి’లో అకిరా.. నిజమేనా..?

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్న “ఓజి” సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కనిపించబోతున్నాడనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. “ఓజి”కి సంబంధించిన ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్టార్మ్’ పాటలోని కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు ఈ రూమర్స్ మొదలుపెట్టారు.

ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన అతిథి పాత్ర (స్పెషల్ క్యామియో) ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలకు అకీరా పేరు జోడించడం జరిగింది. ఈ పాత్రను అకీరా పోషిస్తున్నాడని పలువురు సినీ వర్గాలవారు నమ్ముతున్నారు. మరోవైపు, ఈ సినిమాలో పవన్ మూడు విభిన్న దశల్లో కనిపిస్తారని, అందులో చిన్ననాటి పవన్ పాత్ర కోసం అకీరాను ఎంచుకోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ ప్రైజ్ అవుతుంది.

అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొంతమంది దీన్ని కేవలం పుకారుగా కొట్టిపారేస్తుంటే, మరికొంతమంది ఇందులో నిజం ఉందని నమ్ముతున్నారు. అకీరా నందన్ “ఓజి”లో కనిపిస్తే, అది అతనికి సినీ పరిశ్రమలో ఒక గ్రాండ్ ఎంట్రీ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే, అధికారిక ప్రకటన కోసం వేచి చూడక తప్పదు.

Leave a Reply