వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడలో సర్ధార్ జయంతిని పురస్కరించుకుని ఏక్తా ర్యాలీ
(విజయవాడ, ఆంధ్రప్రభ) : అసాధ్యం అనుకున్న దేశ ఐక్యతను భారత దేశ తొలి హోం మంత్రిగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ సుసాధ్యం చేశాడని ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు. భారత మాజీ ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకు శుక్రవారం విజయవాడలో మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్టరీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీయే కూటమి నాయకులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం చిన్నారుల ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తిగా తిలకించి, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అతిథులు, విద్యార్ధులు స్వదేశీ వస్తువులు కొనుగోలు పై ప్రతిజ్ఞ చేశారు. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీకు ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. మువ్వన్నెల జెండా చేతబూని ఎంపీ కేశినేని శివనాథ్ ర్యాలీను ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్ధులు, నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఏక్తా దివస్ గా జరుపుకుంటామని, విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతదేశం మొత్తం ఐక్యంగా వుండటానికి కారణం సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో గర్వంగా వుందన్నారు. నేటి యువతతో పాటు ప్రజలందరూ స్వదేశీ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా, బీజేపీ నేతలు ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు,పనతల సురేష్,సయ్యద్ బాషా, బాజీ, యామిని శర్మ, కొల్లి నాగేశ్వరరావు లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

