పాస్టర్స్ ఫెలోషిప్, జనరల్ సెక్రటరీగా…

పాస్టర్స్ ఫెలోషిప్, జనరల్ సెక్రటరీగా…

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : శాంతి నిలయం ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు జిల్లా అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక సర్వ సభ్య సమావేశము నందు స్టేట్ కమిటీ అధ్యక్షులు డా.కొమానపల్లి ప్రతాప్ సిన్హా సమక్షంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కొరకు నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఫెలోషిప్ కి రెండు సంవత్సరాలుగా ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహించిన బ్రదర్ తెలగతోటి రత్న కుమార్ ను జిల్లా ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది.

తన ఎంపిక పట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫెలోషిప్ దైవ సేవకులు లీగల్ కమిటీ సభ్యులు మరియు మీడియా కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా లోక్ సత్తా నాయకులు మాదాసు భాను ప్రసాద్ ఈ నూతన కమిటీని బట్టి సంతోషం వ్యక్తం చేసి జనరల్ సెక్రటరీ గా ఎంపిక చేయబడిన రత్న కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.

అదే క్రమంలో తనకు ఈ పదోన్నతి కల్పించిన ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ కు, అభినందనలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దైవసేవకులకు సంబంధించిన విషయంలో తనకు అప్పగించిన బాధ్యతను దేవుని కృపను బట్టి ముందుకు కొనసాగిస్తానని రత్న కుమార్ తెలియజేశారు.

Leave a Reply