Parliament | డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌

Parliament | డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌

Parliament | డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్‌

  • 30న అఖిలపక్ష భేటీ
  • సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తు
  • సర్‌పై అస్త్రాలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లి,ఆంధ్రప్రభ ప్రతినిధి : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 1 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిం ది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఈ నెల 30వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి.

ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి, వారి సహకారం కోరనుంది. డిసెంబర్‌ 1నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయి.

అయితే, ఈసారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశా లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి. అలాగే, సభలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై కేం ద్రాన్ని ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలపై చర్చించేందుకు విపక్షాలు కూడా ప్రత్యేకంగా భేటీ అవకాశం ఉంది. మొత్తం మీద, ఈసారి వింటర్‌ సెషన్స్‌ వాడి వేడీగా కొనసాగనున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారే అవకశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పార్లమెంట్‌ ముందుకు రానున్న కీలక బిల్లులు..

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశా ల్లో ప్రవేశపెట్ట బోయే కీలక బిల్లుల జాబితా రెడీ అయ్యింది. ముఖ్యంగా పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు పది బిల్లులను ఈసారి పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని మోడీ సర్కారు నిర్ణయించింది.

ఈ మేరకు లోకసభ, రాజ్యసభ బులెటెన్‌’లో కేంద్రం ప్రభుత్వం పలు అంశాలను వెల్లడించింది. అణు ఇంధన బిల్లు, 2025 తోపాటు కార్పోరేట్‌ చట్టాల (సవరణ) బిల్లు2025, సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ బిల్లు2025, జాతీయ ర#హదారు ల(సవరణ) బిల్లులతో పాటు ఇతర బిల్లలను ఉభయసభల ముందుకు తీసుకురానున్నారు.

ఉన్నత విద్యా కమిషన్‌ లక్ష్యంగా..

దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లు ను తీసుకురావాలని చూస్తోంది. స‌ది హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌సీఐ) బిల్లు అని పేరును ఖరారు చేశారు. విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఇకపై స్వయంప్రతిపత్తితో పారదర్శకతతో అత్యున్నత విద్యాప్రమా ణాలను పాటించేలా చూడడమే ఈ బిల్లు లక్ష్యం. విశ్వవిద్యాలయాల నిధుల సం ఘం (యూజీసీ), సాంకేతిక విద్యాంశాలను చూసే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), టీచర్ల విద్యాంశాలను చూసే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిలను విలీనం చేస్తూ హెచ్‌సీఐ తేవాలని బిల్లులో ప్రతిపాదించనున్నారు.

Leave a Reply