పార్కిన్సన్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అవసరం

పార్కిన్సన్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అవసరం

  • ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ రాజేష్ అలుగు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పార్కిన్సన్ వ్యాధికి అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ చికిత్సను అత్యాధునిక సాంకేతికతతో అందించేందుకు హైటెక్ సిటీలోని యశోద దవాఖాన యూనిట్ సరైనదని యశోద హాస్పిటల్స్‌ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ అలుగు తెలిపారు. సంగారెడ్డిలోని ఐఎంఏ హాల్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు, వ్యాధి వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. పీడీఎంఆర్సి కేసులను విజయవంతంగా నిర్వహించిన అనుభవాలను పంచుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్న పార్కిన్సన్ రోగుల వివరాలను వెల్లడించారు. సరైన సమయంలో వైద్యం అందితే మంచి ఫలితాలు సాధ్యమని స్పష్టం చేశారు. పార్కిన్సన్ వ్యాధి పరిస్థితి, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని డాక్టర్ రాజేష్ అలుగు పేర్కొన్నారు. మందులు, శస్త్రచికిత్స, ఆధునిక చికిత్సల ద్వారా తగిన శ్రద్ధ తీసుకుంటే పార్కిన్సన్‌తో బాధపడేవారు మెరుగైన, సంతృప్తికరమైన జీవితం గడపగలరని ఆయన అన్నారు.

Leave a Reply