Parakala | 22వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Parakala | 22వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 22 వ వార్డులోని ఓటర్లు ఆదరిస్తే వార్డు సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధి చేస్తానని బిజెపి 22వ వార్డు అభ్యర్థి కొలనుపాక భద్రయ్య వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 22వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి కొలనుపాక భద్రయ్య ఇంటింటి ప్రచారంలో భాగంగా గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. 22వ వార్డులో ఓటర్లు బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు కొలనుపాక అనిల్, కొలనుపాక సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
