Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

  • బీఆర్‌ఎస్ 10వ వార్డు అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : “ఆడబిడ్డగా వస్తున్న నన్ను ఆశీర్వదించాలి” అని బీఆర్‌ఎస్ 10వ వార్డు అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్ ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం రోజు పరకాల మున్సిపాలిటీ 10వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పిట్ట స్వప్నదేవేందర్ ఓటర్లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 10వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్ మాట్లాడుతూ తాను నిత్యం 10వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని అభ్యర్థి పిట్ట స్వప్న దేవేందర్ హామీ ఇచ్చారు. అభ్యర్థి వెంట బీఆర్ఎస్ 10వ వార్డ్ నాయకులు బుస్స భద్రయ్య, చెరుకు సుధాకర్, నాగరాజు, గూడెల్లి రాజా రమేష్, రజిత బుస్స వెంకటేష్, శివశంకర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply