Parakala | వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Parakala | వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : వార్డులోని ఓటర్లు ఆదరిస్తే వార్డు సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజనీ నవీన్ వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనిగరం రజని నవీన్ ఇంటింటి ప్రచారంలో భాగంగా గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. 17వ వార్డులో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
